ఆ విషయంలో మెగాస్టార్ ను బలవంతం చేస్తున్న రామ్ చరణ్....!!
మెగాస్టార్ లాంటి హీరో నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తుస్సు మని ఫ్లాప్ అవుతున్నాయి. ఈ విషయం అభిమానుల కి మింగుడు పడడం లేదు . ప్రెసెంట్ మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో ఒక సినిమా లో నటిస్తున్నాడు . ఈ సినిమా హిట్ అయితే హిట్ అయినట్లు లేదంటే మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి టాటా బై బై చెప్పేయడమే మంచిది అంటున్నారు సినీ విశ్లేషకులు.చిరంజీవి కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారట . మన ఏజ్ కి హీరో రోల్స్ కన్నా సీనియర్ రోల్స్ బెటర్ అని ఆయన ఆరోగ్యం బాగోలేనప్పుడు మనం ఇక ఇండస్ట్రీ కి దూరంగా ఉండటమే బెటర్ అని చెప్పుకొస్తున్నారట . రామ్ చరణ్ సైతం తండ్రిని రెస్ట్ తీసుకోమంటూ బలవంతం చేస్తున్నారట . దీంతో సోషల్ మీడియా లో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది.