అలాంటి వారితో.. ఎప్పటికీ డేటింగ్ చేయను : జాన్వి కపూర్

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీల మధ్య డేటింగ్ లు మీటింగ్లు ఎంత కామనో ఇటీవల కాలంలో పెళ్లిలో విడాకులు కూడా అంతే కామన్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక సినీ సెలబ్రిటీలకు సంబంధించిన డేటింగ్ విషయం ఏదైనా తెరమీదకి వచ్చిందంటే చాలు అది మీడియాకు ఫుల్ మీల్స్ దొరికినట్లుగా మారిపోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా ఇదే విషయం గురించి చర్చ జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు తమ ప్రేమాయనాల గురించి ఎంతోమంది హీరో హీరోయిన్లు సీక్రెట్ గా ఉంచడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. మీడియాకు తెలియకుండా జాగ్రత్తపడేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు ఇక తమ ప్రేమయనాన్ని  మీడియాకు చెప్పడానికి ఇష్టపడుతున్నారు.

 ఇక తమ పర్సనల్ లైఫ్ ని కూడా అభిమానులు అందరితో కూడా షేర్ చేసుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఎవరైనా హీరోయిన్ ఇలా డేటింగ్ గురించి మాట్లాడింది అంటే చాలు ఇక అందుకు సంబంధించిన వార్త వైరల్ గా మారిపోతుంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా జాన్వి కపూర్ బాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ హీరోయిన్గా వెలుగొందుతుంది. అయితే ఇక టాలీవుడ్ లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇటీవలే డేటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్. నేను చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులతో ఎప్పటికీ డేటింగ్ చేయను అంటూ స్పష్టం చేసింది ఇక డేటింగ్ చేసే వారికి నేనే ప్రపంచం కావాలి. నాతో ప్రతిక్షణం వారు ఎంజాయ్ చేయాలి. సినీ ఫీల్డ్ లో చాలా ఒత్తిడి ఉంటుంది. ఒకే వృత్తిలో ఉండేవారు డేటింగ్ చేయడం చాలా కష్టం. అందుకే నేను చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులతో ఎప్పటికీ డేటింగ్ చేయను అంటూ చెప్పుకొచ్చింది జాన్వి కపూర్. దీన్నిబట్టి జాన్వి ఇప్పటికే ఇక ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తితో డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: