కాజల్:తగ్గేది లే అంటున్న సత్యభామ..!!
ఈ క్రమంలోనే సత్యభామ సినిమాకు సంబంధించి ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 35 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ 90% షూటింగ్‌ని పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.. ఈ షెడ్యూల్లో కాజల్ అగర్వాల్ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేసిందని.. ఫైట్ మాస్టర్ సుబ్బు ఆధ్వర్యంలో ఈ సన్నివేశాలను తెరకెక్కించారు అంటూ మేకర్స్ తెలియజేశారు. కాజల్ నూ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారంటూ తెలియజేశారు.
ఈ సినిమా కోసం కాజల్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో శ్రమించి మరి యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసిందని తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలోని కాజల్ పోరాట సన్నివేశాలు ఆకర్షణీయంగా ఉంటాయని చిత్ర బృందం చాలా బలంగా నమ్ముతోంది..సత్యభామ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ కంప్లీట్ చేసి త్వరలోనే విడుదల డేట్ ని ప్రకటిస్తామంటూ చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేస్తున్నారు కాజల్ అగర్వాల్‌తో పాటు ఇందులో ప్రకాష్ రాజ్ నవీన్ చంద్ర తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాతో పాటు ఇండియన్-2 సినిమాలో కూడా నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ మొదలు ఇప్పటికీ ఏడాదిపైనే కావస్తున్న ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.