సినిమా ఇండస్ట్రీ లో ఎన్ని సినిమాల్లో నటించాం అన్నది ముఖ్యం కాదు. నటించిన మూవీ లలో ఎన్ని విజయాలను సాధించాయి అనేదే ముఖ్యం. కొంత మంది ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకొని అదిరిపోయే స్థాయికి చేరుకుంటూ ఉంటారు. మరి కొంత మంది అనేక సినిమాలలో నటించిన కూడా పెద్దగా క్రేజ్ ను సంపాదించుకోరు. మరి కొంత మంది కెరియర్ ప్రారంభంలో ఎన్ని సినిమాలు నటించిన గుర్తింపును సంపాదించుకో కపోయినప్పటికీ ఒక్క హిట్ తో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంటారు.
అలాంటి వారిలో వైష్ణవి చైతన్య ఒకరు. ఈమె తన కెరియర్ ప్రారంభంలో చాలా వెబ్ సిరీస్ లలో నటించిన పెద్దగా గుర్తింపును సంపాదించుకోలేదు. ఇకపోతే పోయిన సంవత్సరం ఈ బ్యూటీ "బేబీ" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం వైష్ణవి కి అదిరిపోయే రేంజ్ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. దానితో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అనేక క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ప్రస్తుతం వైష్ణవి ఏ సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ఈ నటి ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందబోయే ఓ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. బేబీ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.
ఈ నటి ప్రస్తుతం దిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ రెండు మూవీ లతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందబోయే సినిమాలో కూడా ఈ నటి హీరోయిన్ గా ఎంపిక అయింది.
ఇలా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నట్లయితే వైష్ణవి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే స్థాయికి చేరుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.