మా సినిమా రేంజ్ కి వేరే వాళ్లను అడగాల్సిన పనిలేదు... నాగ వంశీ..!

Pulgam Srinivas
తెలుగులో ఎంతో మంది నిర్మాతలు ఉన్నారు. కాకపోతే కొంత మంది మాత్రమే హిట్ , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలను నిర్మిస్తూ ఎప్పుడు బిజీగా ఉంటారు. అలాంటి వారిలో నాగ వంశీ ఒకరు. ఈయన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించాడు. అందులో చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన నిర్మిస్తున్న సినిమాల సంఖ్య కూడా చాలా ఎక్కువ. అలా ఈయన నిర్మించిన సినిమాలు వరుసగా విడుదల అవుతూ ఉండడం.


అలాగే ఎప్పుడూ అనేక సినిమాలను తెరకెక్కిస్తూ ఉండడంతో ఈయన పేరు వార్తల్లో బాగా వినబడుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా ఈ నిర్మాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం అనే సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కు గుంటూరు కారం సినిమాతో పాటు మరో నాలుగు తెలుగు సినిమాలు , అలాగే మరో మూడు డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. దీనితో ఈ సారి సంక్రాంతి పండుగ కు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా సందడి వాతావరణం కనిపించబోతుంది.


ఇది ఇలా ఉంటే గుంటూరు కారం మూవీ విడుదల దగ్గర పడడంతో నాగ వంశీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ ... మా సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంది. అంత మంచి ప్రాడక్ట్ పెట్టుకుని మేము ఇతర సినిమా వాళ్ళని ఎందుకు మీ సినిమా పోస్ట్ పోన్ చేయమని అడగాలి అని చెప్పుకొచ్చాడు. ఇలా నాగ వంశం ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ సినిమాపై ఈ నిర్మాత చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: