ప్రభాస్ స్పిరిట్ కథ ఇదేనా.. సందీప్ గూస్ బంప్స్ ప్లానింగ్..!
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. స్పిరిట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కథ గురించి కొద్దిగా క్లూ ఇచ్చాడు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడట. స్పిరిట్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథతో వస్తుంది. సినిమాలో కొన్ని సీన్స్ పూర్తి చేయాల్సి ఉంది. అవి పూర్తి కాగానే వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్తామని అన్నారు.
ఇక యానిమల్ సినిమా సక్సెస్ తో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగ మెగా అభిమానిగా తనకు చిరు మీద ఉన్న అభిమానాన్ని చూపించాడు. చిరు నటించిన మాస్టర్ సినిమాలోని సిగరెట్ సీన్ ని ఇన్నేళ్ల తర్వాత కూడా గుర్తు చేసుకుని చిరు తనకు ఎంత స్పెషల్ అన్నది చెప్పారు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ టాలెంట్ పాన్ ఇండియా లెవెల్ లో చూపించాడు. ప్రభాస్ తో స్పిరిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా లైన్ లో పెట్టుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆ సినిమా కూడా బన్నీ ఫ్యాన్స్ ఊహకు అందని విధంగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.