జబర్దస్త్ లో సిరి పర్మినెంట్ యాంకర్ కాదా.. అగ్రిమెంట్ ఎన్ని రోజులంటే..!
జబర్దస్త్ యాంకర్ గా చేసిన అనసూయ, రష్మిలకు కూడా కెరీర్ స్ట్రాంగ్ అయ్యింది. జబర్దస్త్ వల్ల ఆ షోలో పాల్గొన్న అందరు కూడా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నారు. అయితే యాంకర్ గా అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకున్నాక ఆమె ప్లేస్ లో సీరియల్ యాక్టర్ సౌమ్యా రావుని పెట్టుకున్నారు. ఆమె కూడా బాగానే మ్యానేజ్ చేసింది. ఏమైందో ఏమో కానీ సౌమ్యా రావు కూడా జబర్దస్త్ కి బ్రేక్ ఇచ్చింది. తన ప్రాజెక్ట్ ల వల్లో లేక మరో కారణమో కానీ జబర్దస్త్ లో సౌమ్యా రావు కనిపించట్లేదు.
ఇక ఆమె ప్లేస్ లో సిరి హన్మంత్ ని తీసుకున్నారు. అనసూయ తర్వాత కొన్ని వారాలు గెస్ట్ యాంకర్ గా కొందరు చేశారు. ఆ తర్వాత సౌమ్యా రావు వచ్చింది. ఆమె పర్మినెంట్ అనుకున్నా ఆమె ఎందుకో మధ్యలో డ్రాప్ అయ్యింది. ఇక ఇప్పుడు సిరి కూడా జబర్దస్త్ యాంకర్ గా వచ్చింది. ఈమైనా సరే పర్మినెంట్ గా ఉంటుందా లేదా మధ్యలో డ్రాప్ అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. సిరి కూడా అగ్రిమెంట్ బేస్ మీద షోకి వచ్చిందని ఆమె కూడా కొన్నాళ్ల పాటే యాంకర్ గా ఉంటుందని అంటున్నారు. మరి జబర్దస్త్ పర్మినెంట్ యాంకర్ గా ఎవరు కొనసాగుతారన్నది చూడాలి. ఓ పక్క ఎక్స్ ట్రా జబర్దస్త్ లో మాత్రం రష్మి తన సీట్ పర్మినెంట్ చేసుకుంది.