2024 లో సంక్రాంతి బరి నుంచి మరో టాప్ సినిమా అవుట్..!!

Divya
కోలీవుడ్లో స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటులలో ధనుష్ కూడా ఒకరు. ఇటీ వలె భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు . అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి బరీలోకి దింపాలని ప్లాన్ చేయగ ఈ క్రమంలోనే సంక్రాంతి బరీ లో టాలీవుడ్ చిత్రాలు వరుసగా విడుదలవుతున్న సమయంలో థియేటర్లతో ఇబ్బందులు ఎదురవుతాయని చిత్ర బృందం భావించి ఈ చిత్రాన్ని తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదల చేస్తారని విషయాన్ని చిత్ర బృందం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక తమిళనాడు శివ కార్తికేయన్ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


శివ కార్తికేయన్, రకుల్ ప్రీతిసింగ్ కాంబినేషన్లో వస్తున్న ఆయలాన్ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు.. కానీ సంక్రాంతి బరిలో ఈగల్ గుంటూరు కారం, హనుమాన్, నా సమిరంగా ,సైంధవ్ అలాంటి చిత్రాలు విడుదలవుతున్నాయి దీంతో తెలుగులో థియేటర్లో సైతం దొరకడం చాలా కష్టంగా మారింది. అలాంటిది డబ్బింగ్ చిత్రాలుకు థియేటర్లు దొరకడం కష్టంగా మారిపోయింది. దీంతో ధనుష్ ,శివ కార్తికేయన్ ఇద్దరు కూడా తమ చిత్రాల మేకర్స్ సినిమా విడుదల విషయంలో యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తున్నది.



కెప్టెన్ మిల్లర్ ,ఆయలాన్  చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి తెలుగు వర్షన్ ని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.జనవరి నెలలో సంక్రాంతి తర్వాత వచ్చే చిత్రాలలో ఈ చిత్రాలను తీసుకురావాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన ఇంకా అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు. మరి ఇప్పటికే సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. కాబట్టి తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు కూడా  తెలుగు సినిమాలకు థియేటర్లు దొరకడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు వాయిదాలు వేసుకోవాలని కోరాము.. కానీ ఇలాంటి సమయంలో డబ్బింగ్ సినిమాలకు ఎలా తీయటం ఇవ్వగలుగుతాము అంటూ ఆయన తెలియజేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: