'సలార్' లో నటించేందుకు.. శ్రియ రెడ్డి ఆ కండిషన్ పెట్టిందట తెలుసా?

praveen
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిసెంబర్ 22వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రభాస్ దేవా పాత్రతోపాటు అటు పృధ్విరాజ్ సుకుమారన్ నటించిన పాత్ర కూడా ఆకట్టుకుంది. అంతేకాకుండా శృతిహాసన్ కూడా డిఫరెంట్ రోల్ లో నటించింది అన్న విషయం తెలిసిందే.

 అయితే సినిమా మొత్తంలో ఎక్కువ సార్లు కనిపించి తన గాంబీర్యమైన నటనతో ఆకట్టుకుంది మాత్రం రాధా రామ పాత్ర అని చెప్పాలి. ఇక ఈ పాత్రలో శ్రియా రెడ్డి నటన అద్భుతంగా ఉంది. ఏకంగా హీరోలతో సమానంగా ఈ పాత్రకు మంచి హైప్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు ప్రశాంత్ నీల్. సలార్ మూవీలో శ్రియ రెడ్డి లుక్స్ బాడీ లాంగ్వేజ్ అన్ని పాత్రకు ప్రాణం పోసాయి అని చెప్పాలి. ఇక చాలా రోజుల తర్వాత శ్రీయ రెడ్డి ఇలా సినిమాల్లో ఒక అద్భుతమైన పాత్రలో నటించడంతో ఆమె అభిమానులు అందరూ కూడా సంతోషంగా మునిగిపోయారు.

 సాధారణంగా అందరూ ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ వస్తేనే చాలు అనుకుంటారు. కానీ శ్రియా రెడ్డి మాత్రం సలార్ సినిమాలో ఛాన్స్ వచ్చిన ఏకంగా ప్రశాంత్ నీల్ కే ఒక కండిషన్ పెట్టిందట. నేను ఈ సినిమాలో నటించాలంటే హీరోతో సమానంగా తన పాత్ర ప్రాధాన్యత ఉండాలని లేకపోతే తాను నటించను అంటూ ముందే చెప్పేసిందట. శ్రియ రెడ్డి మాటలు విన్న ప్రశాంత్ కాస్త నవ్వుకున్నారట. ఎందుకు నవ్వుతున్నారు అని అడిగితే.. రాధా రామ క్యారెక్టర్ కూడా అదే.  నేను ఇతరుల కన్నా పవర్ ఫుల్ గా ఉండాలనుకుంటుంది. నువ్వు కూడా అదే అడుగుతున్నావ్ అంటూ ప్రశాంత్ చెప్పాడట. ఇక ఆయన మాటలను బట్టి సలార్లో తన పాత్ర ఎలా ఉంటుందో శ్రియ రెడ్డి అప్పుడే అర్థం చేసుకుని ఇక ఓకే చెప్పేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: