సలార్: 500 కోట్ల వసూళ్లు.. కానీ అక్కడ ప్లాప్?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి వసూళ్లతో ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ఇప్పటికే 500 కోట్లకి పైగా వసూళ్లని దాటేసి జైలర్ రికార్డ్ ని బ్రేక్ చేసే దిశగా సలార్ మూవీ దూసుకుపోతోంది.అలాగే నార్త్ ఇండియాలో కూడా కలెక్షన్స్ పుంజుకుంటున్నాయి. ఈ వీకెండ్ మొత్తం సలార్ సినిమాకి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. డార్లింగ్ ప్రభాస్ ఖాతాలో సలార్ సినిమాతో బాహుబలి రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ పడినట్లే అని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగులో ఇప్పటి దాకా 290 కోట్ల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. సౌత్ ఇండియాలో తమిళంతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాలలో సినిమా మార్కెట్ పెద్దదని అందరూ భావిస్తూ ఉంటారు. తెలుగు ఆడియన్స్ అన్ని సినిమాలు చూడటానికి చాలా ఇష్టపడతారు. అస్సలు బాషాబేధం ఉండదు. అందుకే ఇతర భాషా సినిమాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు సాధిస్తాయి.



తెలుగు సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తే సాలిడ్ వసూళ్లు వస్తాయి.అయితే ఈ సంవత్సరం కోలీవుడ్ నుంచి జైలర్, లియో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి మంచి కమర్షియల్ హీరోయిక్ మూవీస్ అయినా వాటికి చెప్పుకోదగ్గ కథ, కథనాలు లేవు. అయిన కూడా కేవలం తమిళంలోనే ఆ సినిమాలు ఏకంగా 500 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. సలార్ సినిమాతో పోల్చుకుంటే రెండు సినిమాలు బడ్జెట్ పరంగా గాని విజువల్ ప్రెజెంటేషన్ పరంగా కాని తక్కువలోనే ఉంటాయి. అయితే సలార్ సినిమా ఇప్పటికి తెలుగు రాష్ట్రాలలో 500 కోట్ల మార్క్ ని టచ్ చేయలేకపోయింది. కేవలం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమాలు మాత్రమే తెలుగులో 500 కోట్లు కలెక్ట్ చేశాయి. అయితే ఇప్పుడు సలార్ కూడా లాంగ్ రన్ లో 450 నుంచి 500 కోట్ల మధ్యనే తెలుగు రాష్ట్రాలలో కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. పైగా ఈ సినిమా తమిళనాడులో ప్లాప్ గా మిగిలినట్టు సమాచారం తెలుస్తుంది.అంత తక్కువగా ఈ సినిమాకి అక్కడ వసూళ్లు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: