రోజా పై షాకింగ్ కామెంట్స్ చేసిన మీనా..?
అయితే తన కుమార్తె కాస్త పెద్దగా అవ్వడంతో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది మీనా..తన సెకండ్ ఇన్నింగ్స్ లో పలు సినిమాలలో నటిస్తున్న సమయంలోనే తన భర్త మరణం తనని చాలా కృంగిపోయేలా చేసింది. ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్న మీనా కెరియర్ పరంగా చాలా బిజీగా అవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఇంటర్వ్యూలో భాగంగా తనతో నటించినటువంటి హీరోయిన్స్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
అప్పట్లో హీరోయిన్ పాత్రలకు చాలా డిమాండ్ ఉండేదని కొంతమంది రచయితలు ప్రత్యేకంగా హీరోయిన్లను దృష్టిలో పెట్టుకొని పాత్రలు రాసేవారని అది నిజంగా ఒక అదృష్టం అంటూ తెలిపింది. అప్పట్లో కూడా గ్లామర్ షో చేయడానికి చాలామంది హీరోయిన్స్ సైతం ఆసక్తిగా ఉండేవారని తనకి కూడా అలాంటి సినిమాలలో నటించాలని ఉండేది..కానీ పరిమితి దాటి గ్లామర్ షో చేయలేదని ఎప్పుడూ తెలియజేసింది మీనా.
మీనా హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో రమ్యకృష్ణ, రంభ ,రోజా వంటి వారు కూడా స్నేహితులుగా ఉన్నారని తెలిపింది. వాళ్లతో స్నేహం చేయడం తనకి అదృష్టమని తెలిపింది.. ఎంతమంది స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఎవరితో పోటీ లేదు కానీ రోజాతో మాత్రం తనకు పోటీ ఉండేది అంటూ తెలియజేసింది.. ఇద్దరు కలిసి సినిమాల పరంగా బిజీగా ఉండే వాళ్లని డేట్లు అడ్జస్ట్ కాకపోవడం వల్ల కమిట్ అయిన చిత్రాలకు ఎక్సైజ్ చేసుకొని నటించామని తెలిపింది మీనా.