సాధారణంగా సినీ సెలబ్రిటీల పెళ్లి విషయంలో తరచూ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆయా నటులు వాటినే ఖండించినప్పటి కీ మళ్లీ మళ్లీ అవి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే శృతిహాసన్ కి సైతం ఇదే పరిస్థితి ఎదురయింది. ఆమె పెళ్లి చేసుకుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరొకసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓరీ.. శ్రుతిహాసన్‌కు పెళ్లైందంటూ ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చాడని పేర్కొన్నాయి.
ఈ క్రమంలోనే వాటిపై స్పందించిన శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా ఆ వార్తలను కొట్టి పారేసింది. నాకు ఇంకా పెళ్లి కాలేదు ప్రతి విషయం గురించి పెంచుకునే నేను పెళ్లి గురించి ఎందుకు దాస్తాను అని ఈ సందర్భంగా వెల్లడించింది. అంతేకాదు ఇలాంటి వాటిపై మీరు ఎందుకు స్పందిస్తారు అంటూ శృతిహాసన్ పై తిరిగి కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఇక శృతిహాసన్ ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శంతను తో శ్రుతి హాసన్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అతడితోనే ఆమె వివాహం జరిగినట్లుగా మరోసారి వార్తలొచ్చాయి.
ఇదిలా ఉంటే 'సలార్' తో తాజాగా మంచి విజయాన్ని అందుకున్న శ్రుతి.. ప్రస్తుతం 'డెకాయిట్'తో బిజీగా ఉన్నారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు, ఆమె నటించిన హాలీవుడ్ మూవీ 'ది ఐ' త్వరలోనే విడుదల కానుంది. ఇకపోతే ఏడాది హాసన్ కి బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి ఈ ఏడాది ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వీర సింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాలతో ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరొకసారి సలార్ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది..!!