తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆఖరిగా ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాలో హీరోగా నటించి గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు.
ఇలా "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తూ ఉండగా ... జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందులో మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయబోతున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ కు భారీ ధరకు అమ్మివేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ విడుదల అయిన కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.