నైజాంలో ప్రభాస్ ఆఖరి 6 మూవీల ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
ప్రభాస్ ఆఖరుగా నటించిన ఆరు మూవీ లకు నైజాం ఏరియాలో మొదటి రోజు వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

సలార్ :  ఈ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 22.55 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రవితేజ , పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నటించారు.

ఆది పురుష్ : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో 13.68 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించగా ... కృతి సనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

రాధే శ్యామ్ : ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు నైజం ఏరియాలో 10.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ... రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

బాహుబలి 2 : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో 8.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా ... అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా నటించారు.

బాహుబలి 1 : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించగా ఈ మూవీ నైజం ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు 6.39 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా నటించగా ... దగ్గుపాటి రానా ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. రమ్యకృష్ణ , నాజర్ , సత్య రాజ్ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: