సలార్ మూవీలో ఆ పాత్రని.. గోపీచంద్ రిజెక్ట్ చేశాడా?

praveen
ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమంది రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో జిగ్రీ దోస్తులుగా ఉన్న వారిలో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇక వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం బంధం చూసినప్పుడల్లా అభిమానులకు ముచ్చటేస్తూ ఉంటుంది. ఎక్కడ కలిసిన కూడా ఎంతో ప్రేమగా పలకరించుకుంటూ ఉంటారు ఈ ఇద్దరు హీరోలు. ఇక గోపీచంద్ సినిమా ప్రమోషన్స్ కి ఎన్నోసార్లు ప్రభాస్ వచ్చాడు అన్న విషయం తెలిసిందే.


 గతంలో ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన వర్షం సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆ తర్వాత మరోసారి వీరి కాంబో రిపీట్ అయితే బాగుండు అని అభిమానులు అందరూ కూడా కోరుకున్నప్పటికీ.. అది కుదరలేదు అని చెప్పాలి. అయితే గతంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాలో ఏకంగా రానా పోషించిన పాత్ర కోసం గోపీచంద్ ని సంప్రదించినప్పటికీ ఇక ఆ పాత్ర చేసేందుకు గోపీచంద్ ఒప్పుకోలేదట lట ఇటీవల సలార్ మూవీలోని ఒక పాత్ర కోసం గోపీచంద్ ని సంప్రదించాడట.


 ఆ పాత్ర ఏదో కాదు కోలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ పోషించిన పాత్ర. ఇక పాత్ర కోసం ముందుగా గోపీచంద్ ను అప్రోచ్ అయ్యాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. గోపీచంద్ ఈ సినిమా చేస్తే ఎక్కడ ప్రభాస్ తనకు అవకాశాలు ఇప్పిస్తున్నాడు అని అనుకుంటారేమో అన్న భయంతో తన వళ్ళ ప్రభాస్ కి చెడ్డ పేరు రాకూడదు అని ఉద్దేశంతో ఇక ఈ సినిమా ఆఫర్ ని వదులుకున్నాడట గోపీచంద్. ఒకవేళ గోపీచంద్ కనుక ఈ మూవీలో నటించి ఉంటే మాత్రం సూపర్ గా ఉండేదని అభిమానులు కూడా అనుకుంటున్నారు. అయితే ఇది ఫ్రెండ్షిప్ సినిమా కావడంతో రియల్ ఫ్రెండ్స్ చేస్తే ఇంకా బాగుండేదని సినిమా జనాలందరూ కూడా చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: