లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పై.. ప్రశాంత్ నీల్ ఏమన్నాడో తెలుసా?
ఖైదీ తో పాటు విక్రమ్ అనే సినిమాకు కూడా లింకు పెట్టి తాను సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాను అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఇందులో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో అనేదానిపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే సాధారణంగా ఒక దర్శకుడు ఏదైనా కొత్తగా ట్రై చేశాడు అంటే మిగతా దర్శకులు కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు కానీ ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లాగా ఇతర స్టార్ డైరెక్టర్లు ప్రయత్నించడానికి సాహసం చేయలేదు అని చెప్పాలి
అయితే కేజిఎఫ్ రెండు పార్ట్ లతో పాటు ఇటీవల ప్రభాస్ తో తీసిన సినిమా కూడా ఒకే సినిమాటిక్ యూనివర్స్ అని ప్రచారం జరుగుతుండగా.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. కే జి ఎఫ్, సలార్ రెండు వేరువేరు ప్రపంచాలు అంటూ చెప్పుకుచాడు. ఈ క్రమంలోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పైన కూడా స్పందించాడు. మొదట సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసింది లోకేష్ కనకరాజ్ మాత్రమే. అలా సినిమాటిక్ యూనివర్స్ చేయడం చాలా కష్టమైన పని అంటూ చెప్పుకోవచ్చాడు. నేను దానిపై ప్రస్తుతం శ్రద్ధ పెట్టలేదు అంటూ తెలిపాడు. లోకేష్ డ్రామాని చిత్రీకరించే తీరు ఎంత అద్భుతంగా ఉంటుందని తనకు నచ్చుతుంది అంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు