సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఇకపోతే మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు. మొదట ఈ సినిమాలో పూజా హెగ్డే , శ్రీ లీల ను హీరోయిన్ లుగా ఈ చిత్ర బృందం ఎంపిక చేసుకుంది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా నుండి పూజ హెగ్డే ను తీసి వేసి ఆ స్థానంలో మీనాక్షి చౌదరి ని ఈ మూవీ బృందం తీసుకుంది.
చిన బాబు , సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. రమ్య కృష్ణ , జయరామ్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను రెండు పాటలను ఈ మూవీ బృందం విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ గురించి ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన పనులను ఫుల్ స్పీడ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ ను జనవరి 6 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.