బ్యాడ్ మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే?
ఇడియట్ : రవితేజ, రక్షిత హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చింది అమ్మాయిల మనోభావాలతో ఇష్టం లేకుండా హీరో తన వెంట పడుతూ ముద్దు పెట్టమని హగ్ చేసుకోమని వేధిస్తూ ఉంటాడు. ఇక ఈ మూవీ తర్వాత ఎంతో మంది అబ్బాయిలు కూడా అమ్మాయిలని ఇలాగే వేధించడం మొదలుపెట్టారు కాగా ఈ మూవీ హిట్ అయింది.
పోకిరి : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా హీరో హీరోయిన్లు వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. అయితే ఈ మూవీలో రౌడీగా ఉండే పండు పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఇక పోలీస్ పాత్ర అయినా కృష్ణ మనోహర్ రోల్ ప్రేక్షకులను పెద్దగా ప్రభావితం చేయలేదు .
ఖతర్నాక్ : రవితేజ హీరోగా ఇలియానా హీరోయిన్గా నటించిన ఖతర్నాక్ మూవీ సూపర్ హిట్ అయింది. ఇక ఈ మూవీలో రవితేజ స్టూడెంట్ పాత్రలో ఇక ఇలియానా టీచర్ పాత్రలో నటించగా గురువులను గౌరవించాలి అని సమాజానికి తెలియజేయాల్సింది పోయి.. విద్యార్థులు గురువులని ఏ విధంగా హింసిస్తారో.. ఏ విధంగా ప్రేమలో పడేస్తారో అనే అంశాన్ని ఈ సినిమాలో చూపించారు.
అర్జున్ రెడ్డి : టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన అర్జున్ రెడ్డి ఎంతల విమర్శలు ఎదుర్కొన్న ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శృతి మించిన రొమాంటిక్ సన్నివేశాలలో అందరికీ ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చింది
పుష్ప : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా.. సెన్సేషన్ హిట్ అందుకుంది అయితే ఇక ఇందులో గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించి ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చారు అని చెప్పాలి.