సలార్ ట్రైలర్ చూసి.. ఆనందంలో మునిగిపోతున్న తారక్ ఫ్యాన్స్?

praveen
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన కూడా అటు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తేరకెక్కిన సలార్ సినిమా విడుదల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక అదే సమయంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సినిమా కూడా విడుదలవుతున్నప్పటికీ.. అటు ప్రభాస్ సలార్ సినిమాకి కాస్త ఎక్కువగా బజ్ ఉంది అని చెప్పాలి. ఇక అటు మేకర్స్ కూడా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉండడంతో.. ఇక చిత్ర బృందం  చెబుతున్న విషయాలతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.


 అయితే టికెట్ రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ డే సినిమా చూడటానికి ఎక్కువ మొత్తం ఖర్చు చేయడానికి అయినా సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత అయితే డార్లింగ్ ఫాన్స్ అందరు కూడా ఫిదా అయిపోయారు. ఇలాంటి సినిమా కోసమే కదా ఇన్నాళ్లు మేం ఎదురుచూస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏకంగా ప్రభాస్ డైలాగులు చెబుతుంటే సింహం గర్జించినట్లుగా అనిపిస్తుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషంలో మునిగిపోతున్నారు. అయితే సలార్ ట్రైలర్ చూసి తారక్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందంలో మునిగిపోతున్నారు.


 సలార్ ట్రైలర్ తర్వాత తారక్ ఫ్యాన్స్ సంతోష పడటానికి గల కారణం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రభాస్ తో సినిమా తర్వాత ప్రశాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తారక్ తోనే చేయబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ తో మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే ఆ డైరెక్టర్ చెప్పేసాడు. అయితే ప్రభాస్ తో సినిమానే ఈ రేంజ్ లో తీస్తే ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రశాంత్ నీల్ చెబుతున్న తారక్ మూవీ ని ఇంకే రేంజ్ లో తీస్తాడో అని అభిమానులు అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకుంటున్నారు. మరి సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: