షాక్: పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్..!!

Divya
ఇటీవల బిగ్ బాస్ తెలుగు -7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్టు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. సిద్దిపేట గజ్వేల్ మండలం కొల్లూరులో అతని నివాసం వద్ద ప్రశాంత్ ని అరెస్టు చేసినట్లుగా సమాచారం. అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ జరగడంతో అతనిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన పోలీస్ స్టేషన్ కు తరలించకుండానే మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారట. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ కు సైతం 14 రోజులు రిమాండ్ విధించినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.


ఇలాంటి సమయంలోనే ACP హరి ప్రసాద్ మీడియాతో మాట్లాడదాం జరిగింది. ఆయనే మాట్లాడుతూ అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవ నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ పైన సుమోటోగా కేసును నమోదు చేశామంటూ తెలియజేయడం జరిగింది. పల్లవి ప్రశాంత్ పోలీసులు ఎంత చెప్పినా వినకుండానే పలు రకాల ర్యాలీలు చేస్తూ ఉన్నారని ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్యాన్స్ బందోబస్తుకు వెళ్ళిన పోలీసులు పైన కార్లు ఆర్టీసీ బస్సుల పైన పలు రకాల ధ్వంసం చేశారని తెలియజేయడం జరిగింది.


ఈ ఘటన జరిగిన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పైన దాదాపుగా 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మొదట అతని కారు డ్రైవర్ సాయికిరణ్ రాజులను సైతం అరెస్టు చేశామని ఆ తర్వాత నిన్నటి రోజున పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు మహా విరాన్ ను అరెస్టు చేసామంటే తెలియజేయడం జరిగింది..అయితే ప్రశాంతను పోలీస్ స్టేషన్కు తీసుకురాకుండానే మెజిస్టేషన్ ముందు హాజరు పరిచినట్లుగా తెలుస్తుంది.. ఈ సమయంలోనే మెజిస్టేషన్ అక్కడ తీర్పు ఇస్తూ పల్లవి ప్రశాంతును 14 రోజులు రిమాండ్ విధించాలంటే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతున్నట్లు సమాచారం..తదుపరి విషయాలు త్వరలోనే తెలియజేస్తామంటూ తెలియజేశారు. ఈ విషయం తెలిసిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: