చీర కట్టులో క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న అనసూయ..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె యాంకర్ గా కెరియర్ ను మొదలు పెట్టి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలా యాంకర్ గా అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈ నటి సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా అనసూయ నటించిన సినిమాలు మంచి విజాయలను అందుకోవడం అలాగే ఈ బ్యూటీ కూడా తాను నటించిన సినిమాల్లో తన నటనతో అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో ఈ బ్యూటీ కి వరుసగా తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు పెరిగాయి.
 


ఇకపోతే చాలా కాలం పాటు టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీ కి వరుసగా ప్రస్తుతం సినిమా ఆఫర్ లు భారీగా పెరగడంతో ఈ బ్యూటీ యాంకరింగ్ రంగానికి ప్రస్తుతానికి పులిస్టాప్ పెట్టేసి కేవలం సినిమాలోని మాత్రమే నటిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ నటి చేతిలో అనేక భారీ క్రేజ్ ఉన్న సినిమాలు ఉన్నాయి.  ఆ సినిమాలో కూడా మంచి విజయాలను అందుకున్నట్లయితే అనసూయ క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో అవకాశం దక్కినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన అందాల ప్రదర్శనతో కుర్రకారుకు హిట్ పుట్టిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటికి సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: