'ఓ మై బేబీ' ట్రోలింగ్.. రామజోగయ్య శాస్త్రి ఘాటు రిప్లై..!!

Anilkumar
'గుంటూరు కారం' సినిమా నుంచి  'ఓ మై బేబీ' లిరికల్ వీడియో రిలీజ్ అయిన విషయం తెలిసిందే  నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పై ఎన్నో విమర్శలు వచ్చాయి. విచిత్రంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సాంగ్ పై అటు తమన్ ని ఇటు రామ జోగయ్య శాస్త్రిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సాంగ్ పై ఫ్యాన్స్ మితిమీరిన అంచనాలు పెట్టుకోవడం వల్ల ఇలా జరిగిందా? లేక అవుట్ పుట్ తేడా కొట్టిందా? అనేది తెలీదు కానీ సోషల్ మీడియా మొత్తం ఇదే హాట్ టాపిక్ అవుతుంది. 

కొంతమంది అయితే అసభ్య పదజాలంతో రామ జోగయ్య శాస్త్రి పై ఎదురుదాడికి దిగడంతో స్వయంగా ఆయనే ఈ ట్రోలింగ్స్ పై తన దైన శైలిలో స్పందించారు. ఈ మేరకు రామజోగయ్య శాస్త్రి  .." ప్రతివాడు మాట్లాడేవాడే రాయి విసిరేవాడే. అభిప్రాయం చెప్పే దానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని.. మీ కన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా.. అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేము గొప్పగా చేయలేం. తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి" అంటూ రాస్కొచ్చారు. దీంతో రామజోగయ్య శాస్త్రి చేసిన ఈ పోస్ట్  నెట్టింట వైరల్ గా మారాయి. 

మరోవైపు ఈ సాంగ్ ట్రోలింగ్ పై ఇప్పటివరకు తమన్ స్పందించింది లేదు. థమన్ పై ట్రోల్ జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు ఇలా జరిగింది. అందుకే తమన్ దీన్ని లైట్ తీసుకుని ఉండవచ్చు అని కొందరు చెబుతున్నారు. మరోవైపు గుంటూరు కారం సాంగ్స్ విషయంలో తమన్. ని ట్రోల్ చేయడానికి సాలిడ్ రీజనే ఉంది. అదేంటంటే, మహేష్ గత చిత్రం 'సర్కారు వారి పాట' కు తమన్ ఆశించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేదని అసంతృప్తిలో ఫ్యాన్స్ ఉన్నారు. కళావతి సాంగ్ మినహాయించి మిగిలిన సాంగ్స్ పెద్దగా క్లిక్ కాలేదు. సినిమాలో బీజీయం కూడా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: