గీతా మాధురి గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నందు....!!
ఒకరి కెరియర్ గురించి మరొకరు ఇన్వాల్వ్ చేయమని కేవలం గత రెండేళ్లుగా తన సినిమాల గురించి కాకుండా త్తన ఫైనాన్స్ మ్యాటర్ మాత్రమే గీత మాధురి డీల్ చేస్తుందని నందు తెలిపాడు. నాకు ప్లజెంట్ గా వాతావరణం ఉండడం ఇష్టం అని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇన్కమ్ టాక్స్ గురించి తనకు ఏమీ తెలియదని, అవన్నీ కూడా గీత చక్కగా హ్యాండిల్ చేయగలదని, స్టాప్ కి జీతాలు ఇవ్వడం, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి డేట్స్ సంబంధించిన డబ్బులు తీసుకోవడం, ఎవరికి ఎన్ని రోజులు డేట్స్ ఇవ్వాలి అని విషయం, దానికి తగ్గట్టుగా పేమెంట్స్ కూడా అన్ని తనే చూసుకుంటుందని నందు తెలిపారు. ఏ ప్రాజెక్ట్ చేయడానికి అయినా ముందు రెమినేషన్ ఇంతా అని ముందే ఇంట్లో అందరం కూర్చుని ఫిక్స్ అవుతామని దానికి తగ్గట్టుగానే ఎవరు వచ్చి వర్క్ అడిగినా కూడా క్లారిటీగా ఉంటామని అలాగే పేమెంట్స్ అన్నీ కూడా గీతం ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటుందని వాటిని ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా అదంతా ఆమె ప్లాన్ చేస్తుందని తెలిపాడు అంతే కానీ నన్ను ఒక ప్రాజెక్ట్ రిఫర్ చేయడం కానీ లేదంటే నాకు ఒక సినిమా ఇప్పించడం కానీ గీతా మాధురి చేయలేదని ఇకపై కూడా అలాంటి అవకాశం ఎక్కడ ఉండబోదని నందు స్పష్టం చేశాడు.