ఆ ఇద్దరు తమిళ దర్శకులపై ఫోకస్ పెట్టిన నాని..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. డిసెంబర్ 7 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ మూవీ కంటే ముందు ఈ సంవత్సరం నాని "దసరా" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
ఈ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.


 ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన నాని రెండింటితో కూడా మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకముందే నాని మరో మూవీ ని ఓకే చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అందులో భాగంగా నాని ఓ తమిళ దర్శకుడితో సినిమా చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.


అసలు విషయం లోకి వెళితే ... గత కొన్ని రోజులుగా తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి సిబి చక్రవర్తి , నాని కి ఓ కథ చెప్పినట్లు ఆ కథ నాని కి నచ్చడంతో ఆదర్శకుడి దర్శకత్వంలో పని చేయడానికి గ్రేట్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా కోలీవుడ్ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి కార్తీక్ సుబ్బరాజు కూడా నాని కి ఓ కథ చెప్పినట్లు ... ఆయన చెప్పిన కథ కూడా నాని కి నచ్చడంతో ఈయన సినిమాలో కూడా నటించడానికి నాని ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా నాని ప్రస్తుతం ఈ ఇద్దరు తమిళ దర్శకుల సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: