నాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం మొదట దసరా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా దసరా మూవీ తో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించిన ఈ నటుడు తాజాగా హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇకపోతే ఈ మూవీ కూడా ప్రేక్షకుల నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.
దానితో ప్రస్తుతం ఈ మూవీ కి ఇండియా వైడ్ గ సూపర్ సాలీడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని ... వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయం లోనే నాని ఓ తమిళ దర్శకుడి తో మూవీ సెట్ చేసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం శివ కార్తికేయన్ హీరోగా డాన్ అనే సినిమాను రూపొందించిన సిబి చక్రవర్తి దర్శకత్వంలో నాని ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ దర్శకుడు నాని కి ఓ కథను వినిపించగా ఆయన చెప్పిన కథ నాని కి అద్భుతంగా నచ్చడంతో ఈయన దర్శకత్వంలో నటించడానికి ఇప్పటికే నాని ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే తమిళ్ లో డాన్ అనే పేరుతో రూపొందిన ఈ సినిమాను తెలుగు లో కాలేజ్ డాన్ అనే పేరుతో విడుదల చేయగా ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది.