బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎండింగ్ కి వచ్చేసింది. ఇప్పటికే హౌస్ లో నుండి చాలామంది ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. అలా ఎలిమినేట్ బయటకు వచ్చిన వారి రెమ్యునరేషన్ కి సంబంధించిన విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే బిగ్బాస్ సీజన్ సెవెన్ మరికొన్ని రోజుల్లో ముగిసిపోతుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు మాత్రమే ఉన్నారు. కాగా నిన్నటి ఎపిసోడ్ లో శోభా ఎలిమినేట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. 14 వారాలు హౌస్ లో కంటిన్యూ అయిన శోభా ఎలిమినేట్ అయి 14 వ వారం బయటికి వచ్చింది.
నిజానికి శోభా శెట్టి ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది. ఎందుకంటే ఆమె ఆట తీరు అలా ఉండేది మరి. కానీ బిగ్ బాస్ ఆమెను ప్రతి వారం సేవ్ చేస్తూనే వస్తున్నారు అంటూ ఆ మధ్యకాలంలో శోభ కి సంబంధించి బిగ్ బాస్ పై చాలామంది విమర్శలు సైతం కురిపించారు. అయితే ఈ వారం కచ్చితంగా శోభ ఎలిమినేట్ అవుతుంది అని చాలామంది ముందుగానే ఊహించారు. అనుకున్నట్లుగానే శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి రాగానే కన్నీళ్లు పెట్టుకుంది . నిన్నటి ఎపిసోడ్ లో ఫైనలిస్ట్ లను కన్ఫార్మ్ చేశారు నాగార్జున. అర్జున్, ప్రియాంక, అమర్, ప్రశాంత్, యావర్ ను ఫైనలిస్ట్ లు గా అనౌన్స్ చేశారు నాగార్జున.
చివరిగా శోభా శెట్టి, శివాజీని పిలిచి కాస్త టెన్షన్ పెట్టారు. చివరకు శోభా శెట్టి ఎలిమినేటెడ్ అని అనౌన్స్ చేశారు. బయటకు వచ్చాకా అందరితో మాట్లాడింది. చివరకు శివాజీ కాళ్లకు నమస్కరించి క్షమాపణ చెప్పింది. ఏదైనా తెలియక తప్పు చేసి ఉంటే క్షమించండి అని అడిగింది శోభా.. ఇక ఈ అమ్మడు 14 వారాలకు భారీగానే అందుకుంది తెలుస్తోంది. వారానికి 2.5 లక్షల రెమ్యునరేషన్ అందుకుంది శోభా శెట్టి. అంటే 14 వారాలకుగాను..శోభా శెట్టి 25 లక్షలు అందుకుందని తెలుస్తోంది. దీంతో ఈ వార్త తెలిసిన తర్వాత 14 వారాలకి గాను శోభ భారీ రెమ్యనరేషన్ అందుకుందన్నమాట అని అంటున్నారు. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!