ఓటీటీ లోకి రాబోతున్న పాయల్ రాజ్ పుత్ మంగళవారం.. ఎప్పుడంటే..!?

Anilkumar
థియేటర్స్ లో మిస్సయిన సినిమాలను ఓటీటీ లో చూడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు సినీ లవర్స్. థియేటర్స్ లో విడుదలైన సినిమాలన్నీ కూడా ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో రెండు సార్లు అయినా ఒక్క సినిమాని చూడడానికి రెడీ అవుతున్నారు  ఆడియన్స్. థియేటర్లోకి వచ్చిన నెల రోజులకు లేదా 40 రోజులకు ఓటీటీ లోకి వస్తున్నాయి.  కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదలై మంచి విజయాన్ని అందుకుంటున్నై. అయితే కొత్త సినిమా థియేటర్స్లోకి వస్తున్నాయి అంటే చాలు ఎప్పుడెప్పుడు ఆ సినిమాలు ఓటీటీ లోకి వస్తాయా అని

 వెయిట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మంగళవారం అనే సినిమా కోసం థియేటర్స్ లో సినిమాను చూసినప్పటికి మరోసారి ఓటీటీ లో చూడాలి అని వెయిట్ చేస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా వచ్చిన మంగళవారం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంది. ఆర్ఎక్స్ 100 తో అజయ్ భూపతి, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఒకేసారి పరిచయం అయ్యారు. ఆర్ఎక్స్ 100 లో పాయల్ రాజ్ పుత్ ఓ రేంజ్ లో నటించి మెప్పించింది. 

ఈ సినిమాలో తన నటనతో పాటు బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి మెప్పించింది. అందాల ఆరబోతలో రెచ్చిపోయి నటించిన పాయల్.. మంగళవారం లోనూ అదే రేంజ్ లో రెచ్చిపోయి ఆకట్టుకుంది. ఇక మంగళవారం మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మంచి హిట్ గా నిలిచిన మంగళవారం ఇప్పుడు ఓటీటీలోకి రానుందని టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మంగళవారం డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా మంగళవారం ను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. డిసెంబర్ 22న మంగళవారం ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: