అర్జున్ రెడ్డి తరహా కాన్సెప్ట్ తో నాని నెక్స్ట్ మూవీ.. హీరోయిన్ ఎవరంటే..!?

Anilkumar
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు విడుదల అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటూన్నాడు. అయితే ప్రస్తుతం నానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. అది ఏంటంటే నాని పూజ హెగ్డే కాంబినేషన్లో ఒక సినిమా ఫిక్స్ అయ్యింది అన్న పుకార్లు వినబడుతున్నాయి. ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న పూజ హెగ్డే కి ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక హిట్ సినిమా కూడా లేదు. పూజా హెగ్డే కి మరొక ఛాన్స్ నాని సినిమాతో వచ్చింది అని ఈ వార్త విన్న తర్వాత

ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. శిబి చక్రవర్తి డైరెక్షన్లో నాని హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్గా తీసుకున్నట్లుగా సమాచారం. డాన్ సినిమాతో తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శిబి చక్రవర్తి గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. శివ కార్తికేయన్ తో  ఈ దర్శకుడు తీసిన డాన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు నానితో గనుక సినిమా చేస్తే ఆయన మరొక మెట్టు పైకి ఎదుగుతాడు అని ప్రస్తుతం నాని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి తరహా కాన్సెప్ట్ తో

 ఈ సినిమా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నాని పూజా హెగ్డే కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా రాలేదు. ఈ కాంబినేషన్ ఫ్రెష్ గా ఉంటుందని అభిమానులు సైతం ఫీలవుతున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నాని తర్వాత ప్రాజెక్ట్ లు భారీ లెవెల్ లో తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. ఇతర భాషల్లో సైతం నాని సక్సెస్ సాధించాలని అభిమానులు ఫీలవుతున్నారు.పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. నాని నటించిన క్లాస్ సినిమాల కంటే మాస్ సినిమాలకే బిజినెస్ పరంగా కలిసొస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: