ఐశ్వర్యరాయ్ -అభిషేక్ విడిపోనున్నారా..?

Divya
మాజీ విశ్వసుందరిగా బాలీవుడ్ నటి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైనటువంటి హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈమె గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే త్వరలోనే ఈమె విడాకులు తీసుకోబోతుందని సందేహాలు రేకెత్తేలా కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉండడంతో వీటి పైన వీరిద్దరూ ఎప్పుడు కూడా స్పందించలేదు. ఇప్పుడు ఈ వార్తలు మరింత హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి.
బాలీవుడ్ లో క్రిటిక్ గా పేరు పొందిన ఉమైర్ సందు తన ట్విట్టర్ నుంచి ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్ తో సంతోషంగా లేదంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీనికి తోడు ఇటీవల మీడియా ఈవెంట్లో కనిపించిన చోట అభిషేక్ చేతికి వెడ్డింగ్ రింగ్ ఉండకపోవడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. మరొకవైపు అభిషేక్ ఐశ్వర్యాలను ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేశారంటూ కూడా పలు రూమర్లు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటూ కూడా బాలీవుడ్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే అభిషేక్ బచ్చన్ తాజా ఫోటోలను చూస్తే మాత్రం ఇది అవాస్తవమని తెలియజేస్తున్నారు అభిమానులు.. మరి కొంతమంది కొంతకాలంగా ఐశ్వర్యారాయ్ తన పాపతో ఉంటుందంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి .దీనిపైన క్లారిటీ కూడా రావాల్సి ఉందంటూ వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే బాగుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్ ధూమ్-2 సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడినట్లుగా సమాచారం. అలా జనవరి 14- 2007న వీరికి ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిందని ఆ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన వీరి వివాహం ముంబైలో చాలా గ్రాండ్ గా జరిగిందట. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య అనే కూతురు జన్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: