వామ్మో.. శ్రీ లీల లో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా.. ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు..!!

Anilkumar
కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది శ్రీ లీల. ప్రస్తుతం మోస్ట్ బిజియేaస్ట హీరోయిన్ ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు శ్రీ లీల. చేతిలో ఎప్పుడూ అరడజనులకు పైగా  సినిమాలను పెట్టుకుంటుంది ఈ బ్యూటీ. ఒకపక్క సినిమాలను చేస్తూనే మరొక పక్క తన డాక్టర్ చదువును కూడా పూర్తి చేస్తుంది. సినిమాల్లో తన డాన్స్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. సినిమాలతో పాటు అటు మరెన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో ఎక్కడ విన్న ఏ ఈవెంట్ ను చూసిన కూడా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పేరే వినపడుతోంది. ప్రస్తుతం ఈ అందాల తార నితిన్ హీరోగా నటిస్తున్న ఎక్స్ట్రా ఆర్డినెన్స్


సినిమాలో హీరోయిన్గా కనిపించబోతోంది. టాలీవుడ్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.  ఇందులో ఒకప్పటి టాలీవుడ్ హీరో రాజశేఖర్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. సుధాకర్ రెడ్డి నికిత రెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ట్రైలర్ పని పాటలు వచ్చి ఈ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాయి. అయితే తాజాగా హైదరాబాదులో ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు చిత్ర బృందం. ఈ సందర్బంగా నితిన్ మాట్లాడుతూ.. శ్రీలీలకు ఉన్న మరిన్ని ట్యాలెంట్స్ బయటపెట్టాడు. నితిన్ మాట్లాడుతూ..


నేను ఇప్పటికే చాలా సినిమాలు చేశాను. నేను హీరో, డ్యాన్స్ వచ్చు నాకు అని మాములుగానే ఉంటుంది. శ్రీలీల కూడా బాగా యాక్టింగ్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుందని తెలుసు. డాక్టర్ చదువుతుందని తెలుసు. షూటింగ్ మొదటి రోజే శ్రీలీల వచ్చింది. తన గురించి అడిగితే చెప్పింది. తాను యాక్టింగ్, డ్యాన్స్, డాక్టర్ మాత్రమే కాదు స్విమ్మింగ్ లో స్టేట్ లెవెల్ లో ఆడింది, హాకీ స్టేట్ లెవెల్ లో ఆడింది. తనకి కూచిపూడి, భరత నాట్యం కూడా వచ్చు. ఇంకా వీణ వాయిస్తుంది. ఇంకా చాలా చెప్పింది. నేను ఆ రోజు చాలు ఇంకా అనక పోతే ఇంకా తన ట్యాలెంట్స్ బయటపడేవి. ఇంత చిన్న పిల్లలో ఇన్ని ట్యాలెంట్స్ అని ఆశ్చర్యపోయాను.. నిజంగా తాను గ్రేట్ అంటూ నితిన్ పొగడ్తలతో ముంచేసాడు.. ఇందుకు సంబందించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.. ఇక స్త్రీల నితిన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: