నటనకు గుడ్ బై చెప్పి ఆ పని చేయబోతున్న శృతిహాసన్..!!
గతంలో ఎంతో మంది హీరోలతో అఫైర్స్ నడిపినట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉండేవి.. ఈమె సింగర్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో నాచురల్ స్టార్ నాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి .అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తి అయ్యింది ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు ఈ సినిమా విడుదల సమయం దగ్గరగా పడుతూ ఉండడంతో ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలను కూడా విడుదల చేస్తూనే ఉన్నారు.
డిసెంబర్ 7వ తేదీన ఆయన చిత్రాన్ని చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. హాయ్ నాన్న సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో శృతిహాసన్ నటించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఈమె పాట పాడి డాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం దాదాపుగా కోటి రూపాయల వరకు తీసుకున్నట్లు సమాచారం. శృతిహాసన్ కూడా ఇక రాబోయే రోజుల్లో నటనకు విరామం ఇచ్చి సంగీతం వైపుగా దృష్టి పెట్టాలని పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.