ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అంతే..!!

Divya
చాలా మంది హీరోయిన్స్ ని సైతం గతంలో పలు సినిమాలలో నటించి ఈమధ్య కాలంలో కనిపిస్తే చాలామంది ప్రేక్షకుల సైతం వారిని గుర్తుపట్టలేకపోతున్నారు. అలా కోలివుడ్లో వరస సినిమాలతో తెలుగులో వరుస సినిమాలతో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఒక హీరోయిన్ ని ఈ మధ్యకాలంలో పలువురు ప్రేక్షకులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈమె తల్లి అక్క కూడా హీరోయిన్ గానే నటించారట. ఈ హీరోయిన్ తల్లి 1990వ సంవత్సరంలో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈమె సోదరీ కూడా పలు సినిమాలలో నటించడం జరిగింది.

ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా అందాల తార "రాధ "రెండవ కూతురు తులసి నాయర్.. ఇటీవలే వివాహం చేసుకున్న కార్తీక సోదరి ఈమె.. ముఖ్యంగా మణి రత్నం తెరకెక్కించిన కాదల్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రాన్ని తెలుగులో కడలి అనే సినిమాతో తెరకెక్కించడం జరిగింది. ఇందులో గౌతమ్ కార్తీక్ హీరోగా నటించారు. తన నటనతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ 2014లో యాన్ అనే మరో తమిళ సినిమాలు నటించింది. ఈ చిత్రాన్ని రంగం-2 పేరుతో తెలుగులో విడుదల చేయగా ఈ సినిమాతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది తులసి.

సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది కానీ తాజాగా అక్క కార్తిక పెళ్లిలో మరొక సారి కనిపించింది. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. కాస్త బొద్దుగా ఉండడంతో ఈమెను గుర్తుపట్టలేకపోయారట చాలామంది నేటిజన్స్. ఆ తర్వాత ఈమె రాధ రెండో కూతురుని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. పలువురు నెటిజెన్స్ ఈ ఫోటో పైన పలు రకాలుగా కామెంట్స్ చేయడం జరుగుతోంది. ఏది ఏమైనా రాదా లాగే తన కూతురు కూడా చాలా గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: