హీరోల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సాయి పల్లవి.. ఎంతో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పొచ్చు. మలయాళ ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది సాయి పల్లవి. అనంతరం తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తన నటనకు గాను తనకి న్యాచురల్ బ్యూటీ అనే బిరుదును కూడా ఇచ్చారు ఆమె అభిమానులు. స్టార్ హీరో రేంజ్ లో ఆమెకి ఫాలోయింగ్ ఉంది అని చెప్పొచ్చు. అందుకే ఆమెను ముద్దుగా ఆమె అభిమానులు లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. నార్మల్ కమర్షియల్ సినిమాలకి 

ఎప్పుడూ దూరంగా ఉండే సాయి పల్లవి చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ఉంటుంది. అందుకే గ్లామర్ షోలకు అడుగు దూరంలోనే ఉంటుంది. అందుకే సాయి పల్లవి ఒక సినిమా ఓకే చేసింది అంటే ఆ సినిమాపై ఆటోమేటిక్గా అంచనాలు భారీగా నెలకొంటాయి. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సాయి పల్లవి.. ఇటీవలే నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాను ఒకే చేశారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉంటే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి ఆసక్తికరమైన

 వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న  సాయి పల్లవి క్రేజ్ అండ్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదట. తన తరువాత సినిమాల కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అది కూడా కొంతమంది హీరోలకన్నా ఎక్కువగా. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకి మూడు కోట్లకు పైగా అనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: