నాగార్జున చేతికి ఉన్న ఈ బ్యాండ్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఉల్టా బుల్టా అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీజన్ గత సీజన్ కంటే కాస్త బెటర్ గానే ఉంది అని అంటున్నారు ఆడియన్స్. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో నాగార్జునకి సైతం బయట కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. ఏడవ సీజన్లో ఇప్పటి వరకు మాత్రం మంచి మార్కులతో దూసుకుపోతున్నాడు నాగార్జున. అయితే సీజన్ సెవెన్ లో ఇప్పటి వరకు నాగార్జున ట్రోల్ అయిన సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే గత సీజన్ల కంటే చాలా స్టైలిష్ గా తన హోస్టింగ్ స్టైల్ ను కూడా మార్చుకున్నాడు నాగార్జున.

తన లుక్ పరంగా డ్రెస్సింగ్ స్టైల్ పరంగా ప్రతి వారం చాలా డిఫరెంట్ గా కనబడడానికి ట్రై చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు రంగు రంగుల బట్టలను ధరిస్తూ తెరపై చాలా హ్యాండ్సంగా కనిపిస్తున్నారు. అయితే ఈ ప్రతివారం నాగార్జున వేసుకుని బట్టల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. అయితే గత శనివారం కూడా నాగార్జున ఓ రంగుల చొక్కాని ధరించరు. ఇక ఆ షర్ట్ ధర ఏకంగా లక్షల్లో ఉంది. ఇక ఆ షర్ట్ తో పాటు నాగార్జున ఆరోజు తన చేతికి పెట్టుకున్న ఒక బ్యాండ్ గురించి కూడా సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలుపెట్టారు అభిమానులు. చూడడానికి అది స్మార్ట్‌ వాచ్‌లా కనిపించినా..

దాని వెనక మాత్రం చాలా కథే ఉంది. అదొక ఫిట్‌నెస్‌ ట్రాకర్‌. దాని ద్వారా మన శరీర భాగాల పనితీరును తెలుసుకోవచ్చు. మన బాడీలోని ఒత్తిడి, బీపీ, హార్ట్‌బీట్‌, పల్స్‌ రేట్‌ను అది ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తుంది. అయితే దీని కోసం మన మొబైల్‌లో యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్యాండ్‌ని చేతికి ధరించి.. శరీర భాగాల పనితీరుని మొబైల్‌లో చూసుకోవచ్చు. అయితే ఇది స్మార్ట్‌ వాచ్‌లా ఒక్కసారి కొంటే..ఎప్పటికీ పనిచేసే పరికరం కాదు. ఫిట్‌నెస్‌ని తెలుసుకోవడం కోసం ప్రతి నెల రీచార్జ్‌ చేసుకోవాలి. ఇలాంటి ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ని ధరించాలంటే ఏడాదికి రూ. 25 వేలకు పైగా వరకు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నెల నెల కూడా రీచార్జ్‌ చేసుకోవచ్చు. అయితే ఇలాంటి వాటిని శని సెలెబ్రెటీలు ఎక్కువగా వాడుతూ ఉంటారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: