4 రోజుల్లో "ఆది కేశవ" కి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు పంజా వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" మూవీ తో హీరో గా కెరియర్ మొదటి పెట్టి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇక ఉప్పెన మూవీ తో అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజీ ను సంపాదించుకున్న ఈ నటుడు ఆ తర్వాత కొండపొలం ... రంగ రంగ వైభవంగా అనే సినిమా లలో హీరో గా నటించినప్పటికీ ఈ రెండు మూవీ లు కూడా ఈ నటుడుకి మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందించలేకపోయాయి. ఇలా ఉప్పెన మూవీ తో రెండు అపజయాలను అందుకున్న ఈ నటుడు తాజాగా ఆది కేశవ అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి శ్రీకాంత్ ఎం రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తాజాగా థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుందు. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి నాలుగు రోజుల్లో నైజాం ఏరియాలో 74 లక్షల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్రప్రదేశ్ లో 1.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో 1.84 కోట్ల షేర్ ... 3.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని నాలుగు రోజుల్లో 32 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి నాలుగు రోజుల్లో 2.16 కోట్ల షేర్ ... 4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ మరో 6.84 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: