"ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి నితిన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ ఆఖరుగా మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరో గా నటించాడు. కృతి శెట్టి , క్యాథరిన్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించగా ... సముద్ర ఖని ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నితిన్ కి ఘోర పరాజయాన్ని అందించింది.

ఇకపోతే మాచర్ల నియోజక వర్గం మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ నటుడు తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో శ్రీ లీలా హీరోయిన్ గా నటించగా ... రావు రమేష్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించాడు.  హరిజ్ జయరాజ్ సంగీతం అందించిన ఈ మూవీ ని డిసెంబర్ 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది.

ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ప్రస్తుతం ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 10.35 మిలియన్ వ్యూస్ ను ... 732 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: