తమిళ హీరోలు ప్రస్తుతం నటిస్తున్న క్రేజీ మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న నటులు కొన్ని భారీ సినిమాలలో నటిస్తున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం.

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇప్పటికే లాల్ సలాం అనే మూవీ కి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం టీజే జ్ఞానవెల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు.

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లోనూ ... మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తగ్ లైఫ్ మూవీ లోను హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

ఇకపోతే తమిళ నటుడు సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ఈ మూవీ తో పాటు సూర్య 43 ... వడి వసులు ... కర్ణ అనే సినిమాలలో కూడా హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ లలో కంగువా మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో విక్రమ్ ఒకరు. ఈయన తాజాగా ధ్రువ నక్షత్రం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇకపోతే ప్రస్తుతం విక్రమ్ "తంగాలం" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ ... డి 51 ... మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కూడా ధనుష్ హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ లలో కెప్టెన్ మిల్లర్ మూవీ మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: