'ఉప్పెన' సినిమాను మిస్ చేసుకున్న నటి....!!
రీసెంట్ గా శివాని రాజశేఖర్ ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ' నాకు గతం లో ఉప్పెన సినిమాలో హీరోయిన్ రోల్ ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు చాలా బోల్డ్ గా, లిప్ లాక్ సన్నివేశాలు మరియు ఇంటిమేట్ సన్నివేశాలతో నిండిపోవడం తో నేను ఇలాంటి సన్నివేశాల్లో నటించలేను, చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతాను అని చెప్పాను. కానీ డైరెక్టర్ గారు నాకు చెప్పిన కథ ఒకటి, కానీ అక్కడ తీసిన కథ మరొకటి, అలా ఈ చిత్రం నా చెయ్యి జారిపోయింది' అంటూ చెప్పుకొచ్చింది శివాని.
ఇది తెలుసుకున్న ఆడియన్స్ బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయ్యింది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈమె 'కోటబొమ్మాళి పీఎస్' అనే సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది, శ్రీకాంత్ హీరో గా నటించిన ఈ సినిమా రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. 'లింగి లింగి లింగిడి' అనే ఫేమస్ పాట ఈ చిత్రం నుండి వచ్చినదే. ఈ పాట కారణం గానే సినిమాపై మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమా అయితే హిట్ అయ్యింది కానీ, శివాని కి అనుకున్న స్థాయిలో క్రేజ్ రాలేదు. ఆమె కెరీర్ ని మలుపు తిప్పే సినిమా కోసం మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.