పోలీస్ డాగ్ తో పవన్.. వీడియో వైరల్..!

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.. ప్రస్తుతం ఈయనకు ఇన్స్టాగ్రామ్ లో 2.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.  ఎప్పుడూ రాజకీయాల గురించి పోస్టులు పెట్టే పవన్ ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఎప్పుడో ఓసారి ఆసక్తికర పోస్ట్ పెడుతున్నారు. ఓ రెండు వారాల కింద నరేంద్ర మోడీ సభ గురించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన పవన్ తాజాగా ఓ కుక్క గురించి పోస్ట్ చేయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఓ పోలీస్ కుక్కతో పవన్ సరదాగా 


ఉన్న వీడియోను షేర్ చేస్తూ.." నేను బేగంపేట ఎయిర్ పోర్ట్ లో నా ఫ్లైట్ ఎక్కేందుకు ఎదురుచూస్తుండగా నా కోసం ఓ సర్ ప్రైజ్ విజిటర్ వచ్చాడు. అతను ఎవరో కాదు పోలీస్ డాగ్ స్క్వాడ్ లో ఉండే బిందు. అది నాతో చాలా స్నేహంగా ఉంది. తన తోకని ఆసక్తి గా ఊపింది. తను నాలో ఉత్సాహం నింపింది. నేను విమానం ఎక్కేముందు అనుకోని అందమైన అనుభూతి ఇచ్చింది" అంటూ రాసుకోచ్చాడు పవన్. దీంతో పవన్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ పోలీస్ డాగ్ తో పవన్ క్యూట్ వీడియో అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


 ఇక పవన్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే ఓ షెడ్యూల్ మొదలవగా పవన్ పొలిటికల్ ఈవెంట్స్ వల్ల ఆ షెడ్యూల్ కాస్త వాయిదా పడింది. హరిష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ షూటింగ్ పలుమార్లు వాయిదా పడడం అభిమానుల్ని నిరాశకు గురిచేస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: