నా 20 ఏళ్ల కెరియర్లో.. ఇదే బెస్ట్ రోల్ : నితిన్

praveen
తెలుగు చిత్ర పరిశ్రమ లో టాలెంటెడ్ హీరోగా కొనసాగుతున్నాడు నితిన్. అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక అప్పుడెప్పుడో తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అదే గ్లామర్ మెయింటెన్ చేస్తూ  లవర్ బాయ్గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు మరో కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులు ముందు వచ్చేందుకు రెడీ అయ్యాడు అన్న విషయం తెలిసిందే.

 ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ తో తెరకెక్కిన  సినిమాలో నటించాడు. ఇక ఈ మూవీలో నితిన్ పాత్ర కొత్తగా ఉండబోతుంది అని ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అని చెప్పాలి. ఏకంగా టీజర్ తోనే ప్రేక్షకులు అందరినీ కూడా కడుపుబ్బ నవ్వించగలిగాడు నితిన్. ఇక పూర్తి సినిమా చూస్తే పొట్ట చెక్కలు అవడం ఖాయమని ప్రేక్షకులు కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో తన పాత్ర గురించి ఇటీవల నితిన్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 తన 20 ఏళ్ల సినీ కెరియర్లో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలోనిదే బెస్ట్ రోల్ అంటూ హీరో నితిన్ చెప్పుకొచ్చాడు. ఇక ముందుగా ఈ సినిమా కథ వినగానే ఎంతో ఎక్సైట్ అయ్యాను. వెంటనే ఓకే చెప్పేసాను అంటూ ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఇక సినిమా ముఖ్యమైన ఉద్దేశం ప్రేక్షకులను నవ్వించడమే అంటూ నితిన్ చెప్పుకొచ్చాడు. వక్కంతం వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన  ఈ మూవీలో అటు నితిన్ జూనియర్ ఆర్టిస్టు పాత్ర లో కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీలో నితిన్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీ లీల నటిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: