నాని ట్రెండ్ ను అనుసరిస్తున్న వెంకటేష్ !
లేటెస్ట్ గా నాని డిసెంబర్ మొదటివారంలో విడుదల కాబోతున్న ‘హాయ్ నాన్న’ మూవీని చాల డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నాడు. నాని ఒక డమ్మీ ప్రెస్ మీట్ ను క్రియేట్ చేసుకుని కేసీఆర్ లోకేష్ ల బాడీ లాంగ్వేజ్ లను అనుసరిస్తూ నేటి వర్తమాన రాజకీయాల పై సెటైర్లు వేస్తూ మధ్యలో తన ‘హాయ్ నాన్న’ మూవీని ప్రమోట్ చేస్తూ నాని చేసిన వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది.
ఇప్పుడు అదే ట్రెండ్ ను అనుసరిస్తూ వెంకటేష్ సంక్రాంతికి రాబోతున్న తన ‘సైంధవ్’ మూవీ కోసం ఇప్పటి నుంచే చాల డిఫరెంట్ గా ప్రమోషన్ మొదలుపెట్టేశాడు. తన సినిమా ప్రమోషన్ కోసం వెంకటేష్ ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ తో కలిసిపోవడమే కాకుండా గతంలో తాను నటించిన ‘వాసు’ మూవీలోని ‘పాటకు ప్రాణం పల్లవి’ అయితే సాంగ్ కు అక్కడి స్టూడెంట్స్ తో కలిసి స్టెప్స్ వేస్తూ వెంకీ చేసిన హడావిడిని చూసి ఆ కాలేజీలోని అమ్మాయిలు అబ్బాయిలు కూడ జోష్ లోకి వెళ్లిపోయారని తెలుస్తోంది.
60 సంవత్సరాల వయసు దాటిన వెంకటేష్ తన వయస్సును లెక్కచేయకుండా యూత్ తో తన ‘సైంధవ్’ సినిమా కోసం హంగామా చేయడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఇప్పటికే బాలకృష్ణ తన ‘అన్ స్టాపబుల్’ షో ద్వారా అనేకమంది హీరోలు హీరోయిన్స్ తో ఒక ఆట ఆడుకుంటున్న విషయం తెలిసిందే. తమకు పెరిగిన వయస్సు జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అంటూ భావిస్తున్న సీనియర్ హీరోలు యంగ్ హీరోలతో పోటీపడి చేస్తున్న హడావిడికి సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తి పోతోంది..