నాగార్జునకు కట్నంగా వాటిని తీసుకువెళ్లిన అమల.. ఏమిటంటే..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీ లో అక్కినేని నాగార్జున, అమల దంపతుల గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. వీరిద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉంటారు. అయితే నాగార్జున మొదట దగ్గుబాటి లక్ష్మీని వివాహం చేసుకున్నారు. ఈమెతో విడాకులు తీసుకున్న అనంతరం అమలను ప్రేమించి మరి వివాహం చేసుకోవడం జరిగింది. నాగార్జున, అమల కలసి పలు సినిమాలను నటించారు. ఇలా సినిమాలలో నటిస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి వివాహం చేసుకోవడం జరిగింది. అయితే వీరి పెళ్లికి అక్కినేని నాగేశ్వరరావు మాత్రం ఒప్పుకోలేదని అప్పట్లో వార్తలు వినిపించాయి.

ప్రస్తుతం అమల, నాగార్జున ఇద్దరూ కూడా వైవాహిక జీవితంలో చాలా ఆనందంగానే ఉన్నారు.. నాగార్జునకు నాగచైతన్య ,అఖిల్ ఇద్దరు పిల్లలు ప్రస్తుతం వీరు ఇద్దరు కూడా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగార్జున అమల ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించి పలు విషయాలను తెలియజేశారు. అంతేకాకుండా అమల కట్న కానుకల విషయం గురించి కూడా ప్రశ్న ఎదురవగా పలు విషయాలను తెలియజేసింది.
అమల అక్కినేని ఇంటికి ఎంత కట్నం తీసుకు వచ్చింది అనే ప్రశ్న ఎదురుగా నాగార్జున సమాధానాన్ని తెలియజేస్తూ సాధారణంగా సెలబ్రిటీల కట్న కానుకలు అంటే భారీ స్థాయిలోనే ఉంటాయనుకుంటారు. కానీ అమల కట్నంగా తన పెళ్లి సమయంలో తనకు రెండు కుక్క పిల్లలను మాత్రమే తీసుకువచ్చిందని తెలియజేశారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు మరి నాగార్జున నిజం గానే అమల కట్నం గా కుక్కపిల్లలు తీసుకువచ్చిందా లేకపోతే అమలకు జంతువులు అంటే ఇష్టం అనే విధంగా ఇలా చెప్పిందా అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయంపై అమల క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: