'ఆడికేశవ' మూవీతో వైష్ణవ్ తేజ్ మాస్ ఇమేజ్ సాధిస్తాడా...??
ఇక సోషల్ మీడియా టాక్ విషయానికొస్తే.. ఫస్ట్ హాఫ్ కాస్తా సరదాగా నడిచినా.. సీరియస్ ట్విస్ట్ తో ముగుస్తుంది. సెకండ్ హాఫ్ లో మాస్ జాతర ఉంటుందని చెబుతున్నారు. కమర్షియల్ సినిమాగా వైష్ణవ్ కు హిట్ పడినట్టేనని అభిప్రాయపడుతున్నారు. వైష్ణవ్ తేజ్, శ్రీలీలా, దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి గురించి నెక్ట్స్ లెవల్లో చెబుతున్నారు.శ్రీలీలా ఎంట్రీ అదిరిపోయిందంట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోని వైష్ణవ్ - శ్రీలీలా డ్యుయేట్ ఆకట్టుకుంటుందని తెలుపుతున్నారు. సినిమా మొత్తానికి పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చింది కూడా శ్రీలీలా, ఆమె డాన్స్, ఎనర్జీ అని చెబుతున్నారు. యంగ్ సెన్సేషన్ వెండితెరపై రచ్చ చేస్తుందని అంటున్నారు.ఇక వైష్ణవ్ తేజ్ కు మాస్ హిట్ పడిందని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో మెగా మేనల్లుడు మాస్ జాతర చూపించారంట. వైష్ణవ్ పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన డాన్స్, యాక్షన్ సీన్లలో కుమ్మేశారని అభిప్రాయపడుతున్నారు. మరో మాస్ హీరో ఎంట్రీ అయ్యాడంటున్నారు.అయితే, దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆడియెన్స్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీకి మరో మాస్ డైరెక్టర్ దొరికాడని, బోయపాటిని బీట్ చేసే డైరెక్టర్ వచ్చాడని అభిప్రాయపడుతున్నారు. మాస్, హీరో ఎలివేషన్స్, ఫైట్లలో బోయపాటి లాంటి మార్క్ చూపించారని అంటున్నారు. మొత్తానికి సినిమాను మెప్పించేలా తెరకెక్కించారని తెలుపుతున్నారు. కాసేపట్లో ఫుల్ రివ్యూ రానుంది. ఆతర్వాత వైష్ణవ్ కు హిట్టా? ఫట్టా? అనేది పూర్తిగా స్పష్టం కానుంది.