'యానిమల్' మూవీ తో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌ని ఊర మాస్ క్యారెక్టర్ లో మోస్ట్ వైలెంట్ హీరోగా నార్త్ ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే 'యానిమల్' పై ఈ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. నవంబర్ 23న ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' మూవీని 'కబీర్ సింగ్'పేరుతో హిందీలో రీమేక్ చేసి భారీ సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ 'యానిమల్' విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని ప్రేక్షకులకు అందించబోతున్నారు.
మరీ ముఖ్యంగా 'యానిమల్' రన్ టైం గురించి గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో చర్చ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏ సినిమాకి లేని రన్ టైం 'యానిమల్' మూవీకి ఉండబోతుందని, ఏకంగా మూడున్నర గంటల రన్ టైం తో మూవీ ఉంటుందని కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఆ వార్తలే నిజమయ్యాయి. 'యానిమల్' మూవీ రన్ టైం గురించి స్వయంగా సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలోనే కాదు కొన్ని సంవత్సరాలుగా మరే సినిమాకి రాని షాకింగ్ రన్ టైం తో 'యానిమల్' రిలీజ్ కాబోతోంది. 'యానిమల్' మూవీ ఏకంగా 3 గంటల 21 నిమిషాల 23 సెకండ్ల నిడవి, 16 ప్రేమ్స్ తో రాబోతుందని సందీప్ వంగా వెల్లడించాడు.
అంతేకాకుండా గతంలో కబీర్ సింగ్ సినిమాకి వచ్చినట్టుగానే 'యానిమల్' కి కూడా 'A' సర్టిఫికెట్ వచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ హిస్టరీలోనే 'A' సర్టిఫికెట్ తో రూ.300 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమా రాలేదు. సందీప్ వంగా తెరకెక్కించిన 'కబీర్ సింగ్' మూవీకే ఆ ఘనత దక్కింది. ఇప్పుడు అదే 'A' సర్టిఫికెట్ తో రాబోతున్న 'యానిమల్' మూవీతో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఈ ఏడాది ఆరంభంలో 'పఠాన్', 'జవాన్', 'గదర్ 2' వంటి సినిమాలు బాలీవుడ్ కి ఊపిరి పోసాయి. ఈ సినిమాలతో ఇండస్ట్రీ మంచి కం బ్యాక్ ఇచ్చింది.