టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది అని చెప్పాలి. భీష్మ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సక్సెస్ అందుకోలేదు నితిన్. దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమా మంచి టాప్ సొంతం చేసుకుంది. చిరంజీవి సైతం ఆ సినిమాని మెచ్చుకోవడం జరిగింది. వెంకీ కుడుములకు ఒక మూవీ సైతం ఆఫర్ ఇచ్చారు. దాదాపుగా ఖాయమైన వారిద్దరి సినిమా చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. దాంతో నితిన్ తో మరొక సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ తో ఒక భారీ సినిమాని ప్లాన్ చేశారు ప్రకటించారు కూడా. రష్మిక మందన హీరోయిన్ జీవి ప్రకాష్ సంగీత దర్శకుడు అని కూడా అన్నారు.
డేట్స్ లేవని సాకుగా చూపుతో రష్మిక మందన ఈ సినిమా నుండి తప్పుకుంది. హిట్ ఇచ్చిన దర్శకుడికి కూడా సహాయం చేయలేకపోయింది ఈ బ్యూటీ. చలో సినిమాతో రష్మికను టాలీవుడ్ కి పరిచయం చేసింది వెంకీ కుడుముల. భీష్మ రూపంలో మరొకసారి హిట్ కూడా ఆమెకి దక్కించారు. కారణం ఏదైనా సినిమా నుండి రష్మిక మందన తప్పుకుంది. దీంతో శ్రీ లీల ను రష్మిక మందన ప్లేస్ లోకి తీసుకువచ్చారు. నితిన్ ఫాన్స్ సైతం శ్రీ లీల హీరోయిన్ అని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే తాజాగా ఈమె సైతం ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీలీల చేస్తున్న ప్రాజెక్ట్స్ లో చాలా వరకు పూర్తి అయ్యాయి. భగవంత్ కేసరి ఇటీవల విడుదలైంది.
ఆదికేశవ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయినట్లు సమాచారం. గుంటూరు కారం షూటింగ్ డిసెంబర్ కల్లా కంప్లీట్ అవుతుంది. విజయ్ దేవరకొండ మూవీ కూడా లిస్ట్ లో లేదట. ఇక నితిన్ తోనే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టైటిల్ తో ఓ మూవీ చేస్తుంది. ఈ లెక్కన ఆమె ఖాళీగానే ఉన్నట్లు లెక్క . మరి ఎందుకు నితిన్ మూవీ చేయడం లేదో తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే శ్రీలీల సైతం ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి మరొక కొత్త హీరోయిన్ ని తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది ఆ హీరోయిన్ మరెవరో కాదు నా మహానటి వరుస ప్లాప్స్ లో ఉన్న నభా నటేష్ ప్రస్తుతం ఖాళీగా ఉండడంతో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వరుస ఫ్లాప్స్ తో ఉన్న ఈ బ్యూటీ ఈ సినిమాతో అయినా హిట్ అనుకుంటున్నా లేదా అన్నది చూడాలంటే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది..!!