వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవలే పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. నవంబర్ 1న ఇటలీలో ఈ జంట గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. 'మిస్టర్'(Mister) మూవీ షూటింగ్ కోసం తొలిసారి వరుణ్, లావణ్య ఇటలీలో కలుసుకున్నారు. ఆ తొలి పరిచయం ప్రేమగా మారి కొన్ని సంవత్సరాలు సీక్రెట్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేశారు. ఇక ఎట్టకేలకు తమ రిలేషన్షిప్ బయటపెట్టి ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి తొలిసారి ఏ చోట కలుసుకున్నారో అదే చోట గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. వరుణ్, లావణ్య పెళ్లి తోపాటు రిసెప్షన్ కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీలో జరిగిన పెళ్లికి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అటెండ్ అవ్వగా హైదరాబాద్ లో రిసెప్షన్ కి సినీ తారలంతా
హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లి, రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం వరుణ్, లావణ్య తమ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత తొలిసారి వరుణ్ తేజ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. లావణ్య తన సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.." నా భర్త జాలి, కేరింగ్ కలిగిన ఎంతో అద్భుతమైన వ్యక్తి. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి. కానీ నాలోనే దాచుకుంటాను. మా మూడు రోజుల పెళ్లి ఎంతో అద్భుతంగా ఒక డ్రీమ్ లాగా జరిగింది. మమ్మల్ని ఆశీర్వదించి,
బెస్ట్ విషెస్ అందించిన వారందరికీ నా కృతజ్ఞతలు" అంటూ తన పోస్టులో పేర్కొంది. ఈ సందర్భంగా లావణ్య షేర్ చేసిన పిక్స్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. లావణ్య షేర్ చేసిన పిక్స్ లో ఆమె పెళ్లి చీరకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ చీరపై వరుణ్ లవ్ అని రాసి ఉంది. దాంతోపాటు కాళ్లకు పారాణి, పట్టీలు వేసుకున్న ఫోటో కూడా షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.