స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ లో అదరగొడుతున్న కాజల్ అగర్వాల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయం లోనే వరుస విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇక టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయిన తర్వాత కూడా వరుస విజయాలను అందుకున్న కాజల్ ఇప్పటికీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న బ్యూటీ గా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.
 

ఇకపోతే తాజాగా ఈ నటి బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ మూవీ లో కాజల్ తన నటనతో ... అంద చందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఎన్నో సందర్భాలలో తన అందాలను ఆరబోసి కుర్రకారుకి సెగలు పుట్టించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఆ స్థాయిలో ఎన్నో సార్లు అందాలను ఆరబోసింది.
 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా కాజల్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని దానిపై బ్లాక్ కలర్ లో ఉన్న ఒక కోట్ ను ధరించి బ్లాక్ కలర్ లో ఉన్న షూస్ ను వేసుకొని చాలా స్టైలిష్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: