"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ లేటెస్ట్ మూవీ..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమనులు అయినటువంటి నుపుర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ లో రేణు దేశాయ్ , మురళి శర్మ , అనుపమ్ కేర్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది.


ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ మూవీ కథ ... కథనాలు బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమా రన్ టైమ్ మాత్రం చాలా ఎక్కువ అయినట్లు చాలా మంది భావించారు. దానితో ఈ మూవీ బృందం వారు కూడా ఎక్కువ సమయం వృధా చేయకుండా ఈ మూవీ యొక్క రన్ టైమ్ ను చాలా తక్కువ రోజుల్లోనే తగ్గించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి డీసెంట్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.


ఈ మూవీ ఎలాంటి హడావిడి లేకుండా అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: