తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మందికి మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి మూవీతోనే మంచి విజయం ... మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలా తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి సక్సెస్ ను ... సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో అజయ్ భూపతి ఒకరు. ఈయన కార్తికేయ హీరోగా పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా రూపొందిన ఆర్ఎక్స్ 100 అనే మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది.
అలాగే భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఈ మూవీ ద్వారా అజయ్ భూపతి కి దర్శకుడుగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు మహా సముద్రం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా ఈయన మంగళవారం అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రేపు అనగా నవంబర్ 17 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న కారణంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 13 కోట్ల భారీ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఎ" సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 145 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.