మరొక షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్న బాలకృష్ణ !
ఎన్నికల తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మించే మూవీని అల్లు అరవింద్ బోయపాటి దర్శకత్వంలో నిర్మించే రెండు మూవీలలోను నటిస్తూ వచ్చే సంవత్సరం తన కొడుకు మోక్షజ్ఞ ఫిలిమ్ ఎంట్రీ పై పూర్తి దృష్టి పెట్టాలని బాలయ్య భావిస్తూ ఉండటంతో వచ్చే సంవత్సరం అంతా బాలయ్య బిజీగా ఉండబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య బాలకృష్ణ దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన ఒక ఫ్యాంటసీ స్టోరీ లైన్ కు ఓకె చెప్పడంతో ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది అంటున్నారు.
‘జాంబిరెడ్డి’ ‘కల్కీ’ లాంటి రెండు డిఫరెంట్ సినిమాలను తీసిన ఈ దర్శకుడు ఇప్పుడు తేజ సజ్జా తో ‘హనుమాన్’ సినిమాను తీయడమే కాకుండా ఈసినిమాను ఏకంగా రాబోతున్న సంక్రాంతి రేస్ లో దింపుతూ టాప్ హీరోలను ఖంగారు పెడుతున్నాడు. ఈమూవీ ఫలితం ఇంకా తెలియకుండానే ఇప్పుడు బాలకృష్ణ తో ఒక ఫ్యాంటసీ మూవీకి ప్రశాంత్ వర్మ లైన్ క్లియర్ చేసుకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకునే ఈమూవీలో బాలయ్య ఒక డిఫరెంట్ గెటప్ తో కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 కు స్క్రిప్ట్ అందిస్తున్న ప్రశాంత్ వర్మకు బాలయ్యకు మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం వలన ఈమూవీ ప్రాజెక్ట్ ఓకె అయింది అంటున్నారు. అంచనాలకు అనుగుణంగా ఈమూవీ ప్రాజెక్ట్ ప్రారంభం అయి విడుదల అయితే టాప్ హీరోని దర్శకత్వం వహించిన క్రెడిట్ ప్రశాంత్ వర్మకు దక్కుతుంది..